ఫోటో స్టూడియో లో అగ్నిప్రమాదం.



 ఫోటో స్టూడియో లో అగ్నిప్రమాదం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ పురుషోత్తపురం స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మార్గంలో గల డిలైట్ ఫోటో స్టూడియో లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

స్టూడియో యజమాని మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భోజనం కోసం స్టూడియో కు తాళాలు వేసి వెళ్లగా సుమారు 2 గంటల ప్రాంతంలో స్టూడియో లోపల నుండి పొగలు వస్తుండడం గమనించిన చుట్టుప్రక్కల ఉన్న దుకాణదారులు స్టూడియో యజమానికి ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో హుటాహుటిన స్టూడియో వద్దకు చేరుకున్న అతను తాళాలు తీసి చూడగా లోపల పెద్దఎత్తున అగ్ని కీలలు వ్యాపించి ఉన్నట్లు స్టూడియో యజమాని తెలిపాడు.

సమాచారమందుకున్న అగ్నిమాపక దళం ఘటనాస్థలానికి చేరుకోగా అప్పటికే లోపల చాలావరకు కాలి బూడిదవగా, కంప్యూటర్లు,ఫోటో కెమేరాలు,జిరాక్స్ మిషన్ తోపాటు విలువైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయని,సుమారు 5లక్షల రూపాయలు వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత ఫోటో గ్రాఫర్ బొంతల రమేష్ చెపుతూ వాపోయాడు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వేడిమికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని,కేసు నమోదు చేసుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు కాశీబుగ్గ ఫైర్ అధికారి సోమేశ్వరరావు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post