కబడ్డీ పోటీలను ప్రారంభించిన జిల్లా కబడ్డీ అధ్యక్షులు యార్లగడ్డ వెంకన్న చౌదరి.




 కబడ్డీ పోటీలను ప్రారంభించిన జిల్లా కబడ్డీ అధ్యక్షులు యార్లగడ్డ వెంకన్న చౌదరి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

 పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ ZPHS గ్రౌండ్‌లో కుమార్ టీ పాయింట్ వారి సారథ్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీలను జిల్లా కబడ్డీ అధ్యక్షులు వెంకన్న చౌదరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకన్న చౌదరి క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం క్రీడాకారులకు జెర్సీలను అందజేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post