40 మంది తో కాశీ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం జిల్లా...
కంచిలి మండలం బూరగాం సమీప జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి కాశీ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది.
బస్సులో సుమారు 40 మంది యాత్రికులు ప్రయాణిస్తుండగా, ప్రమాదంలో డ్రైవర్ మరియు గైడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
