సహాయం చేయడం ద్వారా నే అసలైన ఆత్మ సంతృప్తి లభిస్తుంది. కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన P4 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2029 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా నడుం బిగించాలని ఆమెపిలుపునిచ్చారు.
సమాజంలోని ఆర్థికంగా బలమైన టాప్ 10 శాతం వర్గాలు అత్యంత పేద 20 శాతం కుటుంబాలను దత్తత తీసుకుని వారికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. పేద కుటుంబాలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి మార్గనిర్దేశం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
చిన్న సహాయంతోనే పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలని, పరోపకారం ద్వారానే అసలైన ఆత్మసంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అన్నారు.
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టిన ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బేస్తవారిపేటలో మొదటి విడతగా 100 కుటుంబాలను దత్తత తీసుకున్న సెయింట్ ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు.
ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన సెయింట్ ఫౌండేషన్ ఫౌండర్ బీవీఆర్ మోహన్ రెడ్డి 716 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ప్రశంసించారు.
పేద ప్రజలు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, డీఎల్డీఓ బాలు నాయక్, ఎంపీడీవో రంగనాయకులు, బెస్తవారిపేట తహసీల్దార్. జితేంద్ర కుమార్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
