మత్స్యకారుల సేవ పథకం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల.



 మత్స్యకారుల సేవ పథకం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ఒంగోలు  కడలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ' మత్స్యకారుల సేవలో ' పథకంలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో ఆర్థిక సహాయాన్ని జమ చేసే జిల్లా స్థాయి కార్యక్రమం మంగళవారం ప్రకాశం భవనంలో జరిగింది. మంత్రి స్వామితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఒంగోల్ శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ రావు

 సంత నూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని ప్రజా ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత్స్యకారులు వీక్షించారు. 

అనంతరం మత్స్యకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పెన్షన్ పొందేందుకు వయోపరిమితి తగ్గింపు, సబ్సిడీపై డీజిల్ సరఫరా, రాయితీపై పడవలు, వలలు అందజేత వంటి సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం మొదటి నుంచీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మత్స్య సంపద పెరిగేలా రెండు నెలల పాటు సముద్రంలో మిషన్ బోట్ల ద్వారా వేటపై నిషేధం ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు నెలల పాటు మత్స్యకారుల జీవనోపాధి కోసం గతంలో రూ.10 వేల చొప్పున చేసే ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం 20 వేలకు పెంచిందని తెలిపారు. ఈ విధంగా 2026 - 27 సంవత్సరానికి ప్రకాశం జిల్లాలో 8694 మంది మత్స్యకారులకు రూ.17.38 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అందజేస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయులు చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సోనా బోట్ల సమస్యను సమర్ధంగా ఎదుర్కోవటంపై దృష్టి పెట్టామన్నారు.

 ఒంగోలు శాసనసభ్యులు సభ్యులు జనార్ధన్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తీర ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకారులకు అందుబాటులోకి తెచ్చేలా తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం అన్నారు.

సంతనూతల పాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా మత్స్యకారులకు అన్నివేళలా అండగా ఉంటున్నట్లు చెప్పారు.

పొడవైన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి మత్స్య సంపద రూపంలో ఆదాయం రావడంతో పాటు సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు కూడా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను మత్స్యకారులందరూ వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 

ఈ పథకం ద్వారా కలుగుతున్న ఆర్థిక ప్రయోజనానికి సంబంధించిన మెగా బ్యాంక్ చెక్కును మంత్రి, ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా ఈ సందర్భంగా మత్స్యకారులకు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు పేరయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మత్స్యకారుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post