మందస ములిపాడు లో పెద్ద చెరువు మెట్లు ప్రారంభోత్సవం.



 మందస ములిపాడు లో పెద్ద చెరువు మెట్లు ప్రారంభోత్సవం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.

మందస మండలం ములిపాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ లాడ్స్ రూ.4 లక్షలతో నిర్మించిన పెద్దచెరువు మెట్ల ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష చేతుల మీదుగా ప్రారంభోత్సవం.

శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, ములిపాడు గ్రామంలో గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఎంపీ లాడ్స్ నిధులు రూ.4 లక్షలతో నిర్మించిన పెద్దచెరువు మెట్లను పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. గ్రామస్తుల చిరకాల కోరిక మేరకు పెద్దచెరువుకు మెట్లు నిర్మించడం జరిగిందని, దీనివల్ల మహిళలకు, వృద్ధులకు స్నానాలు, పండుగల సమయంలో ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ఆయనకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పలాస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post