శ్రీ నెమలిగుండ్ల రంగ నాయక స్వామివారి సేవలో అన్నా దంపతులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జె.పి.చెరువు గ్రామ నల్లమల్ల అటవీ సమీపంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా వెంకట రాంబాబు దుర్గాకుమారి దంపతులు శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు.
స్థానికనాయకులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.శ్రీ నెమలి గుండం పుష్కరిణిలో పవిత్ర జలాలను తలపై చల్లుకుని,తమ ఇంటి ఇలావేల్పు,తమ ఆరాధ్యదైవమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి మూల విరాట్ (స్వయంభువు)ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల కోర్కెలను తీర్చే రంగనాయకస్వామి వారిని,బ్రహ్మోత్సవం సమయంలో దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
