ఘనంగా బాబు జగజీవన్ రావు118వ జయంతి వేడుకలు.


 

ఘనంగా బాబు జగజీవన్ రావు118వ జయంతి వేడుకలు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలులో  బాబు జగజీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.భారతదేశ అభివృద్దిలో ఎంతో కీలక పాత్ర పోషించిన బాబూ జగ్జీవన్ రామ్ గారి  సేవలను మనందరం ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. 

ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్, కలెక్టర్ కార్యాలయం సెంటర్ లలోని ఆయన విగ్రహాలకు బాపట్ల పార్లమెంటు సభ్యులు  తెన్నేటి కృష్ణప్రసాద్,  జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు  దామచర్ల జనార్దన్ రావు, బి.ఎన్.విజయకుమార్ లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ ను కట్ చేసారు. ఈ సందర్భంగా నెల్లూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పలు జిల్లా అధికారులు, పలు సంఘాల నేతలు కూడా జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా  శ్రద్దాంజలి ఘటించారు.  

ఈ సందర్బంగా బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య పోరాటంతో పాటు భారతదేశ నిర్మాణంలో వ్యవసాయ,రక్షణ శాఖల మంత్రిగా ఎంతో కృషి చేశారన్నారు. 

ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే మనం అణుపరీక్షలు నిర్వహించామన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు.

ఈ కార్యక్రమంలో   ఒంగోలు ఆర్ డి ఓ  శ్రీమతి లక్ష్మి ప్రసన్న, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీ లక్ష్మా నాయక్,  ఎస్.సి కార్పోరేషన్ ఈడి అర్జున్ నాయక్,  ఒంగోలు మునిసిపల్ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు, డిటిసి శ్రీమతి సుశీల, డిపిఓ శ్రీ వెంకటేశ్వర రావు,   వివిధ దళిత సంఘాల నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య, నీలం నాగేంద్ర,  తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post