కంభం లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో కందులాపురం సెంటర్ నందు రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు మాట్లాడుతూ ఆర్ధిక వేత్త, న్యాయ కోవిదుడు,అస్తిత్వ ఉద్యమాలకు, దశదిశలనుచూపిన స్ఫూర్తి దాత భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా" బి. ఆర్.అంబేద్కర్ గారి 135 వ జన్మదిన సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాం....
స్థానిక కందులాపురం సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కంభం మండల తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలోనిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.స్వతంత్ర భారతంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రజల హక్కులకు రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు
యావత్ ప్రపంచం గర్వించదగిన ఆ దళితబాంధవుడి ఆశయసాధనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పునరంకితమవుతోంది... జై భీమ్..!
ఈ కార్యక్రమంలో కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సిరివెళ్ల రవికుమార్, మండల అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసులు, రైతు నాయకులు తోట శీను, సగర డైరెక్టర్ మల్లికార్జున రావు, పట్టణ అధ్యక్షులు మాధవమూర్తి, కోలా ప్రసన్న, ముస్లిం మైనార్టీ నాయకులు రజాక్ బాషా, జిలాని, రఫీ, బేగ్, బూత్ కన్వీనర్లు రాజు, జెడి బాబు, రాజయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

