వడదెబ్బకు మృతి చెందిన ఉపాధి హామీ కూలికి పరిహారం చెల్లించాలి- వెంకన్న డిమాండ్.
అనకాపల్లి ఏప్రిల్:14
దేవరాపల్లి, పని ప్రదేశం వడదెబ్బకు మ్రుతి చేందిన మునగపాక మండలం చూచు కొండమండలం ప్రశాంతి నగర్ కాలనీకి చెందిన బీరరాము కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు, మంగళవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు చేశారు. సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన రాము ఏనుగుకొండ సమీపంలో తోటి కార్మికులతో పనులు చేస్తుండగా ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్ప కూలి పని చేస్తున్న ప్రదేంలో మృతి చెందాడని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రాము కుటుంబానికి పది లక్షలు నష్ట పరిహారం చెల్లించి కుటుంబాన్ని అన్ని విదాలుగా ఆదు కోవాలని డిమాండ్ చేసారు పని ప్రదేశంలో టెంట్లు మెడికల్ కిట్లు మంచి నీరు సౌకర్యం వంటి కనీస మౌలిక సదు పాయాలు కల్పించడం లో ప్రభుత్వ పూర్తిగా వైపల్యం చేందిందని తెలిపారు, పని చేస్తున్న చోట జిల్లా వ్యాప్తంగా టెంట్లు సౌకర్యం కల్పించాలని కోరారు ఎండలు తీవ్రంగా ఉన్నం దున మజ్జిగ ఎర్పాట్లు కల్పిం చాలని ఉదయం ఆరు నుండి పది గంటలు వరకు మాత్రమే పని చేయిం చాలని డిమాండ్ చేసారు గత పది వారాలుగా ఫెమెంట్లు చేల్లించ లేదని కూలీలు తీవ్రమైన అందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు ఉపాధి హామీ చట్టం పట్ల ప్రభుత్వ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుం దని,తెలిపారు ఉపాధి హామీ కూలిలు అన్న ఉపాధి హామీ చట్టం అన్న ప్రభుత్వానికి చులకనగా ఉందని అగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం గా అమలు చేయాలని,వడ దెబ్బకు మ్రుతి చేందిన బీరా రాము కుటుంబాన్ని ప్రభుత్వ వెంటనే ఆదు కోవాలని అప్రకటనలో వెంకన్న డిమాండ్ చేసారు.
