భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి డా॥ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసులు.



 భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి డా॥ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసులు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఏప్రిల్ :14 

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, భారత రత్న, మహనీయ తత్వవేత్త డా॥ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంకితభావంతో నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు ముఖ్య అతిథిగా హాజరై, డా॥ అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు.

*​ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..* 

​"డా॥ అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన బడుగు, బలహీన వర్గాల శాశ్వత ప్రేరణాశక్తి మరియు దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. అకుంఠిత విద్యా సాధనతో, సామాజిక అసమానతలపై పోరాటంతో ఆయన భారత దేశ భవిష్యత్తును మార్చిన మహనీయుడు."

​కుల, మత, లింగ విభేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనది.

స్త్రీలకు విద్యా హక్కులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన కృషి అమోఘం.

డా॥ అంబేడ్కర్ చూపిన బాటలో నడుస్తూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.బి ఇన్స్పెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని డా॥ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post