ఏసీబీ వలలో గుణ్ణంపల్లి వి ఆర్ ఓ.
ద్వారకాతిరుమల, ఏప్రియల్ 15. క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు వీఆర్వో చంద్రలీల బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, పక్కా ప్రణాళికతో ఆమె నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు
ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు వివరాలను వెల్లడించారు.
