కార్మిక లోకం సంక్షేమమే కూటమి ప్రభుత్వం ల‌క్ష్యం- రెడ్డి అప్పల నాయుడు.


 కార్మిక లోకం సంక్షేమమే కూటమి ప్రభుత్వం ల‌క్ష్యం- రెడ్డి అప్పల నాయుడు.

-  కార్మిక కర్షకులకు 140 వ మేడే శుభాకాంక్ష‌లు.

- కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వెల్లడి.

ఏలూరు, ఏప్రిల్ 30:- రాష్ట్రంలోని కార్మికులు, కర్ష‌కులు, శ్రామికులు త‌మ శ్ర‌మ‌ను ధార‌పోస్తూ దేశ‌, రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వాములుగా ప‌ని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం. తిరిగి కార్మికుల, పేద‌ల‌ జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు. ఈ సందర్భంగా 140 వ మేడే సంద‌ర్బంగా కార్మిక‌, శ్రామిక,క‌ర్ష‌క లోకానికి రెడ్డి అప్పల నాయుడు మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

 ‘‘కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమన్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా ప‌నిచేస్తుందన్నారు. ఉచిత ఇసుక‌విధానాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చి కార్మికుల‌కి అండ‌గా నిల‌బ‌డిందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు కుటుంబానికో పారిశ్రామిక‌వేత్త‌గా వుండాల‌న్న ఆశ‌యంతో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అలాగే స‌మాజంలో పేద‌రికాన్ని స‌మూలంగా నిర్మూలించాల‌నే ల‌క్ష్యంగా కూటమి ప్రభుత్వం చేప‌ట్టిన పీ4 విధానం పేదలు, కార్మికుల కుటుంబాల‌కు చేయూతగా మారుతుందన్నారు.

పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు, అయితే గ‌త ఐదేళ్ల దుర్గ్మార్గ పాల‌న‌లో రాష్ట్రం ప్ర‌గ‌తికి దూర‌మైందన్నారు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ప‌దినెలల్లోనే రాష్ట్రంలో ప‌లు పరిశ్రమల స్థాపనతో పారిశ్రామిక రంగం కళకళలాడుతుందన్నారు. తిరిగి కార్మికుల, పేద‌ల‌ జీవితాల్లో వెలుగు కిర‌ణాలు ప్ర‌స‌రిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కార్మిక లోకానికి అండ‌గా ఉంటుందని రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు.

Add


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post