ప్రపంచ కార్మికులకు మే డే శుభాకాంక్షలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి శంకర్. మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా పలాస నియోజకవర్గ కార్మికులకు, కష్టజీవులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు *వైయస్సార్సీపి అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన రావు* ఒక ప్రకటనలో తెలిపారు. నాడు అదనపు పని గంటల కుదింపు కొరకై శ్రమ దోపిడి అంతానికై అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికుల పోరాటానికి ఆత్మ త్యాగానికి గుర్తుగా మే డే ను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మే డే స్ఫూర్తిగా కార్మికులంతా ఐక్యంగా సమస్యలు పరిష్కారం కోసం కలసి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కార్మికులు నిర్వహించుకునే ఒకే ఒక్క పండగ మేడే అని అన్నారు. మరో మారు నియోజకవర్గ ప్రజానీకానికి, కార్మికులకు, కర్షక లోకానికి,మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బమ్మిడి దుర్యోధనరావు స్పష్టం చేశారు.
Add

