యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లింపు.


 యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లింపు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ ద్వారా మరో ముఖ్యమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించబడింది.

ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి పోధిలి భార్గవనాథ్ భార్య శ్రీమతి పోధిలి భావిత గారికి రూ.1,20,00,000 (ఒక కోటి ఇరవై లక్షలు) విలువైన చెక్కును గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ P. రాజా బాబు చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యూనియన్ బ్యాంక్ అందిస్తున్న కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్‌లోని ఇన్సూరెన్స్ సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. 

ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వి రవి కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్లో అత్యుత్తమ ప్రయోజనాలు యూనియన్ బ్యాంక్ అందిస్తున్నదని తెలిపారు. క్లెయిమ్‌ను తక్కువ సమయంలోనే పరిష్కరించడం బ్యాంక్ సేవల నాణ్యతను ప్రతిబింబిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్ , RABD మేనేజర్ షహీర్ తిమ్మసముద్రం బ్రాంచ్ హెడ్ గిరిప్రసాద్ గవర్నమెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్ రామ్ గోపాల్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post