ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి -మంత్రి డా. డోలా.


 ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి -మంత్రి డా. డోలా.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు,జనగణన-2027 ప్రక్రియ 'స్వీయ గణన' (Self-Enumeration) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు నిచ్చారు. 

గురువారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు ఆధ్వర్యంలో 'స్వీయ గణన' కింద తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జనగణన-2027 ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా 'స్వీయ గణన' (Self-Enumeration) కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజుల పాటు షెడ్యూల్ జారీ చేయడమైనదన్నారు. అందులో భాగంగా ఈ రోజు నేను స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆధ్వర్యంలో 'స్వీయ గణన' కార్యక్రమం నిర్వహణలో భాగంగా మా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు.

  ప్రకాశం జిల్లా లోని గ్రామీణ ప్రాంతంలో 2412 బ్లాకులుగా, పట్టణ ప్రాంతంలో 845 బ్లాకులుగా మొత్తం 3255 బ్లాకుల్లో జనగణన కార్యక్రమం జరుగు తుందని, అందుకు గాను క్షేత్ర స్థాయి సిబ్బందిని నియమించడంతో పాటు వీరికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మే 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ఎన్యుమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. 

 ఈ జనగణనలో ఎ కుటుంబం మిస్ కాకుండా చూడాలని, ఈ విషయమై ఎన్యుమరేటర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అందుబాటులో వున్న సమయాన్ని ఎన్యుమరేటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.  

 ప్రజలు కూడా ఈ జనగణన కార్యక్రమానికి సహకరించి తమ వివరాలను తెలియచేయాలన్నారు.  

ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల తహసిల్దార్ ఆంజనేయులు, జనగణన నమోదు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post