శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు మార్కాపురం లో ఘనంగా జరిగాయి


 శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు మార్కాపురం లో ఘనంగా జరిగాయి.

అకుంఠిత దీక్ష పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ మహోన్నత ఆశయం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసి సఫలీకృతుడైన భగీరథ మహర్షి అకుంఠిత దీక్ష పట్టుదలకు మారుపేరుగా నిలిచిపోతారని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కొనియాడారు. 

గురువారం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆయన విగ్రహం, చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మదేవుని ప్రత్యక్షం కోసం ఒంటి కాలుపై తపస్సు చేసి గంగను భూమి పైకి తెప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారని వివరించారు. సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చనే విషయాన్నివిద్యార్థులు, యువకులు తెలుసుకోవాలని సూచించారు. భావితరాలకు ఈయన చరిత్రను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పీవీ కృష్ణారావు, ఇతర ఉప్పర, సగర సంఘం నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post