విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేరాఫ్ అడ్రస్ – సాంఘిక సంక్షేమ హాస్టళ్లు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు/మార్కాపురం*తేదీ: 23 ఏప్రిల్ 2026
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులను కల్పిస్తూ, వారి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సిద్ధంగా ఉన్నాయని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (DD) ఎన్. లక్ష్మా నాయక్, ఎం .ఏ . ఒక ప్రకటనలో తెలిపారు.
గౌరవనీయ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారి ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లను ఆధునీకరించి, ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్య విశేషాలు మరియు సౌకర్యాలు: విస్తృతమైన వసతి:ప్రకాశం జిల్లాలో 52 మరియు మార్కాపురం జిల్లాలో 47 హాస్టళ్లు 3వ తరగతి నుండి పీజీ వరకు చదివే విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్నాయి.
పౌష్టికాహారం - ఆరోగ్యమే మహాభాగ్యం:ప్రభుత్వ మెనూ ప్రకారం వారానికి 3 సార్లు చికెన్, 6 గుడ్లు, ప్రతిరోజూ పండ్లు మరియు చిక్కీలతో కూడిన బలవర్ధకమైన భోజనం అందించబడుతోంది. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) వాడుతున్నారు.
వ్యక్తిగత సంరక్షణ:ప్రతి విద్యార్థికి అవసరమైన కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. అదనంగా ట్రంక్ బాక్స్, బెడ్ షీట్లు, నోట్ బుక్స్ మరియు క్రీడా సామగ్రి వంటి వస్తువులను ఉచితంగా అందజేస్తున్నారు.
విద్యా ప్రగతి: 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో 99.66% ఉత్తీర్ణత సాధించి మన హాస్టళ్లు రికార్డు సృష్టించాయి. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా "ఆల్-ఇన్-వన్" మెటీరియల్ మరియు ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.
ఆధునిక సౌకర్యాలు:భద్రత కోసం సీసీ కెమెరాలు, శుభ్రమైన తాగునీటి కోసం ఆర్ ఓ (RO) ప్లాంట్లు, మరియు పరిశుభ్రత కోసం ప్రత్యేక శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
అడ్మిషన్ల వివరాలు (2026–27 విద్యా సంవత్సరం)
ఎస్సీ / ఎస్ టి /బీసీ /ఓబీసీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ గారు కోరారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు/తల్లిదండ్రులు తమ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్నుసంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన కార్యాలయాలు మరిన్ని వివరాలకు ఒంగోలు, కొండపి, దర్శి, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, బి.పేట ప్రాంతాల్లోని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులను సంప్రదించగలరు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన వసతులను ఉపయోగించుకుని, పేద విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగి సమాజానికి గర్వకారణంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయలని సాంఘిక సంక్షేమ శాఖ. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నాయక్ కోరారు.

