కనిగిరి పట్టణంలో భారీ CASO ఆపరేషన్ – గంజాయి విక్రేతలు, అసాంఘిక శక్తులపై పోలీసుల కఠిన తనిఖీలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కనిగిరి లో నేరాల నియంత్రణ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు కనిగిరి పట్టణంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.
కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిరెడ్డి కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో అనుమానాస్పద ఇళ్లు, వ్యక్తులు, మరియు ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ముఖ్యంగా గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను నమోదు చేసి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇలాంటి ఆపరేషన్ల ద్వారా సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకువిజ్ఞప్తి చేశారు.

