ఘనంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన పోలీసు ఉన్నతాధికారులు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి (రాంబిల్లి)ఏప్రిల్:23 రాంబిల్లి మండలం, గజిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఫొటోవోల్టాయిక్స్' ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ తరపున సాదర స్వాగతం లభించింది. విశాఖ రేంజ్ ఐజి గోపినాథ్ జట్టి,మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
.jpg)