అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సదుపాయాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసికోవాలి.
టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బిశెట్టి విజయలక్ష్మి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఏప్రిల్ :23.మాడుగుల మండలం. గర్భిణీలు, బాలింతలు శిశు సంక్షేమశాఖ ద్వారా అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బిశెట్టి విజయలక్ష్మి అన్నారు. గురువారం మాడుగుల మండలం మేజర్ పంచాయతీ గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో సి డి పి ఓ జి.ఎర్రయ్యమ్మ ఆదేశాలతో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ కార్యక్రమం లో బిశెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తీసుకోవలసిన ఆహారం, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు ఆహారంలో తీసుకునే విధంగా అలవాటు చేసు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హసీనా బేగం. గ్రామ కార్యదర్శి సతీష్ కోపరేటివ్ ప్రెసిడెంట్ సరగడం అధిబాబు టీడీపీ నాయకులు రాజు అంగన్వాడీ టీచర్స్పిచంద్ర.
కే. వి పద్మ. టి తులసి మహాలక్ష్మి. జీ సూర్యకళ. కే ధనలక్ష్మి. బి వెంకటలక్ష్మి. కే నాగలక్ష్మి. ఎం వెంకటలక్ష్మి. యూ దేవి మరియు అంగన్వాడీ పిల్లలు గర్భిణీ శ్రీలు పాల్గొన్నారు
.
.jpg)