పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ విజయ సునీత. ఆదేశం.


 పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ విజయ సునీత. ఆదేశం. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా లో ఈనెల 25వ తేదీన జరగబోవు పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. 

సోమవారం స్థానిక కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, వైద్య సదుపాయం, బస్సుల సౌకర్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  

విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు. అదేవిధంగా 24వ తేదీ జరగబోవు ఏపీఆర్జేసీ, డీసి పరీక్షల ను సైతం పకడ్బందీగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ వలియా, ఏపీఆర్జేసీ జిల్లా కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి, మార్కాపురం ఆర్టీసీ డిఎం లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post