అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇళ్లు ఇస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ.
ఏలూరు ఏప్రిల్ 21,క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్ : అర్హులైన జర్నలిస్టుల సొంత ఇంటి కలను నెరవేరుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో బడేటి చంటిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి, “అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇళ్లు అందించడానికి తాను కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉంటానని, ముఖ్యంగా వారి ఇళ్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితంగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి జబీర్, హరీష్ మాట్లాడుతూ ఏలూరు జర్నలిస్టుల ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అని అన్నారు. ఏలూరు జర్నలిస్టుల అందరి తరపున ఈ హామీని స్వాగతిస్తున్నామని త్వరలోనే ఈ విషయంలో సానుకూల అభివృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ ఏలూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఏపీడబ్ల్యూజేఎఫ్ అక్రిడేషన్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ మెంబర్ కళ్యాణ్, సుబ్రహ్మణ్యం, వాసు, సాయి, ప్రతాప్, జయరాం, అర్జున్, యూనియన్ నాయకులు ఏలూరు జర్నలిస్టులు పాల్గొన్నారు.

