కంభం లో సిఐ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని అర్బన్ కాలనీలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో కంభం బేస్తవారిపేట అర్ధవీడు ఎస్సైలు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని ఈరోజు ఉదయం అర్బన్ కాలనీ యందు కార్టూన్ సెర్చ్ నిర్వహించారు
అర్బన్ కాలనీ పరిధిలో ఉన్నటువంటి 150గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహన మరియు అండర్ సెక్షన్ 102 సి ఆర్ పి సి సెక్షన్ ప్రకారం మూడు ద్విచక్ర వాహనాలు ఫైన్ విధించబడింది. అనంతరం 120 ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు.అలాగే మోటర్ వెహికల్ చట్ట ప్రకారం ఈ చలానాలు ద్విచక్ర వాహనాలకు చాలా కట్టుకోవాలన్నారు.
అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్. చేసినట్లయితే ఆటో మోటార్ సైకిల్ ను చీజ్ చేస్తామన్నారు. క్రికెట్ బెట్టింగ్ పేకాట గంజాయి మరియు అసాంఘిక కార్యకలాపాలకు సైబర్ నేరాలకు పాల్పడొద్దని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు తెలియజేయాలని కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు ప్రజలకు వాహనదారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి. బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి. అర్ధవీడు ఎస్సై శివ నాంచారయ్య. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

