దేశ నాయకుల విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం.
జిల్లా టిడిపి అధ్యక్షులు బడేటి చంటి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ స్పష్ఠీకరణ.
ఎమ్మెల్యే చింతమనేని, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి విగ్రహాల ఆవిష్కరణ.
క్రైమ్9 మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, ఏప్రిల్ 14.
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి మార్గదర్శకులని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ కొనియాడారు. దేశ నాయకుల విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను జిల్లా టిడిపి అధ్యక్షులు బడేటి చంటి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ,, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని బడేటి చంటి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చింతమనేని ప్రభాకర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రెడ్డి అప్పలనాయుడు, కాన్షిరాం విగ్రహాన్ని గంటా పద్మశ్రీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలందించిన మహనీయుల విగ్రహాలను కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల భావితరాలకు అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్ర మరువరానిదని బడేటి చంటి అన్నారు. జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, EUDA చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిపో కార్యదర్శి పిల్లి రాజు, వేగి రామసూరి, రేమల్లి పవులు, నంబూరి రవికుమార్ , బి ఎల్ నారాయణ, చంటిబాబు, శ్యామ్, శివకుమార్, కె.వి. రావు, ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ టి ఆంజనేయులు, టిడిపి నాయకులు జుంజు మోజెస్, ఆర్నేపల్లి తిరుపతిరావు, పలువురు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

