రోడ్డు ప్రమాదములో యువకుడు మృతి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఏప్రిల్:27.చోడవరం :మృతుడు అయిన లెక్కల శ్రీనివాసు తండ్రి కొండబాబు, 28 సం.లు, ఎలక్ట్రీషియన్, వంటర్లపాలెం గ్రామం, వి. మాడుగుల మండలం, అనకాపల్లి జిల్లా, అల్లిఖానుడుపాలెం గ్రామం, వూడేరు పంచాయతీ, అనకాపల్లి మండలం మరియు జిల్లా అను ఆసామి అచ్చుతాపురం దగ్గర ఉన్న లారస్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నట్లు, మృతుడు వి. మాడుగుల మండలం, వంటర్లపాలెం గ్రామానికి చిందిన వ్యక్తి అయినట్లు, మృతుడు తన అమ్మమ్మగారి ఊరు అయిన అనకాపల్లి మండలం, వూడేరు పంచాయితీ, అల్లిఖానుడుపాలెంలో ఉంటూ ప్రతిరోజు తన డ్యూటికి వెళ్ళి వస్తున్నట్లు, నిన్న అనగా ఆదివారం శెలవు దినం కావడంతో మృతుడు తన స్వగ్రామం వి. మాడుగుల మండలం, వంటర్లపాలెంలో ఉంటున్న తన తల్లిదండ్రులను చూడడానికి తన ఏ పి 39 ఏపి యస్ ఎఫ్ 5016 నెంబరు గల పల్సర్ బైక్ పై వెళ్ళినట్లు, తదుపరి ఈ దినం అనగా తేది సోమవారం ఉదయం సుమారు 04-30 గంటలకు తన గ్రామం వంటర్లపాలెం నుండి తన అదే పల్సర్ బైక్ పై అచ్చుతాపురం లో ఉన్న లారస్ కంపెనీకి డ్యూటికి వెళ్తుండగా మార్గ మధ్యలో చోడవరం గ్రామం దాటి గజపతినగరం గ్రామం దగ్గరలో గల మారుతీ సుజుకి షోరూం సమీపంలో ఉదయం సుమారు 5 గంటలకు తన ముందు వెళ్తున్న ఏపి 39 యు వై 9395 ట్రాక్టర్ డ్రైవరు సడన్ గా బ్రేక్ వేయడం వలన వెనుక నుండి వెళ్తున్న మృతుడు శ్రీనివాస్ తన బైక్ ను అదుపు చేయలేక ముందు ఉన్నట్రాక్టర్ ను బలంగా గుద్ది క్రింద రోడ్డు మీద పడిపోవడం వలన తనకు నుదుటిపైన బలమైన రక్త గాయం అయ్యి అక్కడికక్కడే చనిపోయినాడు. సదరు జరిగిన ఆక్సిడెంట్ పైన మృతుని మేనమామ అయిన బొబ్బాది శ్రీను తండ్రి (లేటు) మాణిక్యం తగుచర్య నిమిత్తం చోడవరం పోలీస్ స్టేషన్ నందు రిపోర్టు ఇచ్చినందున సిఐ పి.అప్పలరాజు చోడవరం పి యస్ ఉత్తర్వులు మేరకు చోడవరం ఎస్సై బి.జగ్గారావు బి ఎన్ యస్ గా కేసు నమోదు చేసి పోస్టుమోర్టెమ్ పోస్ట్మార్టం నిమిత్తం బాడీ ని సి హెచ్ సి చోడవరం కు తరలించారు.
