రాష్ట్రంలో ఏర్పడ్డ పెట్రోల్ సంక్షోభం పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిరసన.


రాష్ట్రంలో ఏర్పడ్డ పెట్రోల్ సంక్షోభం పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిరసన.

క్రైమ్9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం స్టాప్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.

శ్రీకాకుళం ఏప్రిల్:28 శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం హరిపురం గ్రామ సమీప పెట్రోల్ బంక్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అసమర్ధత వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని దానివల్ల ప్రజలు బంకులు వద్ద రోడ్ లపై బారులు తీరారని ఇంతకు ముందు రేషన్ కోసం యూరియా కోసం రోడ్డు పై నిలబెట్టారని ఇప్పుడు పెట్రోల్ కోసం నిలబెట్టారని మండిపడ్డారు. 3నెలలకు తగ్గ నిల్వలు ఉన్నా కానీ కొరత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు లేని కొరత మన రాష్ట్రానికే ఎందుకు ఉందని మండిపడ్డారు రాష్ట్రంలో మద్యం ఫుల్ పెట్రోల్ నిల్ అన్న ఆయన ఆల్కహాల్ తో ఇంజిన్ రన్ ఐతే దానిలో మన రాష్ట్రం సక్సెస్ అయ్యుండేదాని ఎద్దేవా చేసారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని ప్రజల తక్షణ అవసరం పై స్పందించి ఈ సంక్షోబాన్ని నివారించాలని హెచ్చరించారు.

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post