ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ల అరెస్ట్.


 ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ల అరెస్ట్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా :మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి కారకులైన ఇద్దరు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డిఎస్పి యు .నాగరాజు

ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ యువరాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

గత నెల 26న టిప్పర్ - ప్రవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో పూర్తిగా దగ్ధమైన బస్సు.

ప్రమాదంలో 14 మంది సజీవ దహనం మరో 29 మందికి గాయాలు.

ప్రమాద సమయంలో లైసెన్స్ లేని యువరాజ్ బస్సు నడిపాడు: 

లైసెన్సు ఉన్న డ్రైవర్ కు అధిక నగదు ఇవ్వాల్సి వస్తుందని లైసెన్స్ లేని యువరాజును డ్రైవర్ గా పెట్టుకున్నాడు:.

ఎనిమిది నెలల క్రితం సెకండ్ హ్యాండ్ బస్సును హరికృష్ణ రెడ్డి కొనుగోలు చేశాడు:.

బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసినా బస్సు నడుపుతున్నారు: 

మామూలుగా ఈ బస్సు వినుకొండ మీదుగా గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంది: 

ప్రయాణంలో తరచూ రిపేరు వస్తుండడంతో జాతీయ రహదారి మీదుగా మార్కాపురం వైపు వస్తుందని డీఎస్పీ నాగరాజు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post