రెవెన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ విజయ సునీత.


 రెవెన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ విజయ సునీత.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా లో ప్రధానంగా నెలకొన్న రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలనిజిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత అధికారులను ఆదేశించారు.

బుధవారం మార్కాపురం కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్ లు, మండల సర్వేలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 6 నెలలు రెవెన్యూ సమస్యలపైనే దృష్టి పెడతామని తెలిపారు.రీ సర్వే జరిగే గ్రామాలకు ప్రతిరోజు తహసిల్దార్ లు వెళ్లాలన్నారు. మ్యుటేషన్స్, 22A భూములు, ఇతరుల భూములు వంటి వాటిలో చెడ్డ పేరు రాకుండా అధికారులు చూసుకోవాలన్నారు.రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. రెవిన్యూ విషయాల్లో మార్కాపురం జిల్లా వెనుకబడి ఉందని ఆ చెడ్డ పేరు పోగొట్టేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని తెలిపారు.ముఖ్యంగా వీఆర్వోలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇలా అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post