ఘనంగా శక్తిస్వరూపిణైన వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు .


 ఘనంగా శక్తిస్వరూపిణైన వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు . 

పులివెందుల. ఏప్రిల్ 26, క్రైమ్9 మీడియా రిపోర్టర్ త్రీలోకేష్.

వాసవి జయంతి అనేది ఆర్యవైశ్య సమాజానికి అత్యంత పవిత్రమైన పండుగ. అమ్మవారి అవతారంగా పూజలందు కునే దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకాప రమేశ్వరి. వైశాఖ శుద్ధ దశమి నాడు కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతు లకు పరమేశ్వర వరప్రసాదంగా జన్మించింది వాసవాంబ. దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతూ, యవ్వనవతి అయిన ఆ కన్యకను విష్ణువర్ధనుడనే రాజు చెరబట్టబోతాడు. అప్పుడు వాసవి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో తనకు అండగా నిలిచిన 102 గోత్రాలకు చెందిన బంధువులతో కలసి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆమె బలిదానా నికి చిహ్నంగా విష్ణువర్థనుడి కొడుకు ఆమె గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పటినుంచి వైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరిని తమ కులదైవంగా పూజించడం మొదలు పెట్టారు. 

అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, వాసవి అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగి ఆర్యవైశ్య సంఘం వారు మరియు భక్తులు పాల్గొన్నారు . జై వాసవి జై జై వాసవి

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post