చలివేంద్రాన్ని ప్రారంభించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు.
ఏలూరు. ఏప్రిల్ 26.క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరులో వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుందని హరినాథ్ బాబు బృందావన్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరకా భుజంగరావు తెలిపారు. ఏలూరు నగరంలోని బృందావన్ పార్క్ వద్ద ఈరోజు చలివేంద్రాన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రారంభించారు. దాక్షరసం ఏర్పాటుచేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ భుజంగరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం వేసవికాలం లో వివిధ రకాల జ్యూసులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు పంపిణీ చేస్తున్నమన్నారు. ద్రాక్ష రసం, జ్యూసులు మ్యాంగో జ్యూస్, రసనా, బాదంపాలు, వివిధ రకాల జ్యూసులు ప్రతివారం పంపిణీ చేస్తామని తెలిపారు. అసోసియేషన్ సెక్రటరీ పోతేనే మురళీకృష్ణ కోశాధికారి దుర్గాప్రసాద్ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్రరావు లు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని తెలిపారు.
