పిఏడి పై డయాబెటిస్ బాధితులకు అవగాహన అవసరం- లేకుంటే కాలు కోల్పోయే ప్రమాదం- డాక్టర్ శ్రీకాంత్ రాజు.


 పిఏడి పై డయాబెటిస్ బాధితులకు అవగాహన అవసరం- లేకుంటే కాలు కోల్పోయే ప్రమాదం- డాక్టర్ శ్రీకాంత్ రాజు.

ఏలూరు, ఏప్రిల్ 30 క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

 డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గే సమస్య అయిన పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పై అవగాహన అత్యవసరమని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండో వాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో వివరించారు. డయాబెటిస్ ఉన్నవారిలో పిరిఫెరల్,ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి సమస్య వేగంగా పెరుగుతోందని డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండే చిన్న గాయాలు కూడా మానకుండా పుల్లు గా మారే ప్రమాదం ఉంది అన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చు అని హెచ్చరించారు. నడిచేటప్పుడు కళ్ళల్లో నొప్పి రావడం కాళ్లు త్వరగా అలిసిపోవడం పాదాలు చల్లగా ఉండడం మానని గాయాలు ఏర్పడడం వీళ్ళు నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు సకాలంలో కాళ్ల రక్త ప్రసరణ పరీక్షలు డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు అన్నారు. డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయి కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని పొగ తాగడం పూర్తిగా మానాలని సూచించారు.అవసరమైతే మందులు లేదా యాంజియో ప్లాస్టి వంటి ఆధునిక చికిత్సల అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రతిరోజు ప్రాధాన్య పరిశీలించడం చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేశారు. ముందస్తు అవగాహన మరియు సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించగలమని డాక్టర్.శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం ఎం.సంతోష్ కుమార్ ఏపీ మేనేజర్ ఎస్వీవి రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post