ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని మంగళవారం అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాంచారయ్య అదుపులోకి తీసుకున్నారు.
పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.27,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎస్సై నాంచారయ్య మండల ప్రజలను హెచ్చరించారు.
మండలంలో ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తే టోల్ ఫ్రీ 100 నంబర్ కు ప్రజలు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వవచ్చని అన్నారు.
