జనసేన పార్టీ సభ్యత్వం మార్చి 17 వరకు పొడిగించారు.
జనసేన సభ్యత్వాలను పెంచడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి - రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, మార్చి 11:- జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వం ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు పార్టీ పొడిగించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పదో తారీకుతో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసినప్పటికీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పొడిగించిన ఈ సమయాన్ని ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క జనసైనికుడు వినియోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించి, పార్టీ ఉద్యమ సభ్యత్వాలను పెంచే దిశగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.. నియోజకవర్గం లో జనసేన సభ్యత్వాలను పెంచడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన తెలిపారు.
