రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరమర్శించిన జాయింట్ కలెక్టర్ కల్పన.


 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరమర్శించిన జాయింట్ కలెక్టర్ కల్పన.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, 

 ఒంగోల్ జిజిహెచ్ వైద్యాదికారులకు సూచించారు.  

గురువారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు లోని జిజిహెచ్ ను సందర్శించి మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.  

 ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులు పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు అవసరమైన అన్నీ వైద్య సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్, వైద్యులకు సూచించారు.  

జాయింట్ కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిజిహెచ్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post