బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన డిఆర్ఓ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ తొమ్మిది మీడియా ప్రతినిధి దాసరియోబు.
ఒంగోలు,మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మంచి వైద్యం అందిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు తెలిపారు.
బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఓబులేసు విలేకరులతో మాట్లాడుతూ, మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన 28మందిలో 14 మందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రికి తరలించారన్నారు.
వీరికి ఇక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామన్నారు.
క్షతగాత్రుల బంధువులకు మెప్మా భవనంలో వసతి కల్పించడం జరిగిందన్నారు.
బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మొత్తాన్ని త్వరలోనే అందిస్తామన్నారు.
క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందిస్తామన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి వెంట ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జి జి హెచ్,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
