గంజాయి నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష:


 గంజాయి నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష:

 కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి (కొత్తకోట)మార్చి:05 మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో రాజీ పడేది లేదని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన 138 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి శిక్ష పడటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మతేజ పెట్రోల్ బంక్ సమీపంలో తేది: 11.03.2017న గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు.నిందితుల నుండి సుమారు 138 కిలోల గంజాయి (6 పీవీసీ బ్యాగులు), ఒక Etios కారు (AP 31 CN 2158) మరియు ఒక మోటార్ సైకిల్ (AP 31 CJ 8197) స్వాధీనం చేసుకున్నారు.  

చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరినారాయణ నిందితుడైన వర్రీ నర్సింగరావు, 43సం.,లు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,00,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.  

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పక్కా ఆధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేసిన అప్పటి కొత్తకోట ఎస్.ఐ డి.శేఖరం మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, ఫోరెన్సిక్ రిపోర్టులు (REL) మరియు సాక్ష్యాధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్సి.హెచ్.సూర్యనారాయణని,కోర్టు మోనిటరింగ్ సెల్ సిబ్బందిని కొనియాడారు. గంజాయి సాగు, విక్రయం లేదా రవాణా వంటి చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. పాత కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.తుహిన్ సిన్హా, జిల్లా ఎస్పీ.​నిందితుడికి శిక్ష పడటం ద్వారా అక్రమ రవాణాకు పాల్పడే వారిలో భయం కలుగుతుందని, ఇది జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఎంతో దోహదపడుతుందని జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post