స్కిల్ ఎడ్యుకేషన్‌పై ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం.


 స్కిల్ ఎడ్యుకేషన్‌పై ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయుటకు వృత్తి శిక్షకులు (ఒకేషనల్ ట్రైనర్స్) మరియు ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

జిల్లా కలెక్టరేట్‌లోని పి జి ఆర్ ఎస్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ దాసరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు మొత్తం నైపుణ్య ఆధారిత విద్య (స్కిల్ ఎడ్యుకేషన్) వైపే దారితీస్తుందని తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వం స్కిల్ ఎడ్యుకేషన్‌కు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

 అలాగే ప్రకాశం జిల్లాను రాష్ట్రంలో స్కిల్ ఎడ్యుకేషన్ అమలులో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో స్కిల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలు, వృత్తి శిక్షకులు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్రలు, పాఠశాల స్థాయిలో సమన్వయం, స్కిల్ ల్యాబ్‌ల సమర్థ వినియోగం, రికార్డుల నిర్వహణ మరియు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే విధానాలపై విస్తృతస్థాయి లో చర్చించారు.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ కొత్తపట్నం ప్రిన్సిపాల్ శ్రీమతి మిరున్నీసా,మరియు కేజీబీవీ కె. బిట్రగుంట ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రావంతి, రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరించి స్కిల్ ఎడ్యుకేషన్ అమలు విధానం గురించి సమగ్రంగా వివరించారు.

అలాగే జీ సీ డో ఓ,శ్రీమతి హేమలత మాట్లాడుతూ వోకేషనల్ ట్రైనర్ల పాత్రలు, బాధ్యతలు మరియు పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్ సమర్థవంతమైన అమలుకు అవసరమైన అంశాలను వివరించారు. 

ఈ కార్యక్రమం లో వోకేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ మరియు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలోని మొత్తం 88 ప్రభుత్వ పాఠశాలల నుండి 158 మంది వోకేషనల్ ట్రైనర్లు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది, ప్రభుత్వ పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్‌ను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post