నిలువ నీడ లేకుండా 60 సంవత్సరాల చెట్టును నరికి వేసిన కాంట్రాక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా హైవే రోడ్డుపక్కన గల ఏపుగా పెరిగిన సుమారు 60 సంవత్సరాలు వయసు గల పెద్ద వృక్షాన్ని నరకడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎండకు ఆ చెట్టుక్రింద నీడలో వివిధ గ్రామాలకు వెళ్ళు ప్రయాణికులు , బస్టాండ్ లో దిగిన ప్రయాణికులు ఎంతోమంది ఆటోల కోసం,బస్సులకోసం వేచి ఉండేవారు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న చెట్లను నరకడానికి సంధించిన అధికారుల అనుమతి తీసుకోవాలి అలాంటిది ఎవరి అనుమతి లేకుండా ఇలా అక్రమంగా చెట్లను నరకడం స్థానిక ప్రజలు చూసి నివ్వెర పోతున్నారు. ఈ దాస్టికానికి పాల్పడి వారిపై వాల్టా చట్టాల ద్వారా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా రోడ్డు వెంట ఉన్న భారీ చెట్లను నరకడం చాలా దారుణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
