అధికారి అంటే ఇలా ఉండాలి - గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ ఇసాక్ ‘అక్షర’ దీపం!
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
గిద్దలూరు కేవలం కుర్చీకే పరిమితం కాకుండా, సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా నిలిచి అందరి నీరాజనాలు అందుకుంటున్నారు.
గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ పి. ఇసాక్ విద్యార్థినుల చీకట్లను తొలగించి, వారి భవిష్యత్తులో వెలుగులు నింపేందుకు ఆయన చేసిన అద్భుతమైన సాయం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది.
విద్యార్థినుల కష్టం చూసి కరిగిపోయిన మనసు:
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎస్సీ బాలికల వసతి గృహం-1 లో విద్యుత్ కోతల వల్ల విద్యార్థినులు చదువుకోవడానికి పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇసాక్ గారు, వెంటనే స్పందించారు.
సమస్యను వినడమే కాదు, దానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్న ఆయన గొప్ప సంకల్పానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కూడా చేతులు కలిపారు.
రూ. 60 వేల విలువైన భారీ ఇన్వర్టర్ బహుకరణ:
చదువుకునే పిల్లలకు కరెంటు లేక ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, సుమారు రూ. 60,000 విలువైన భారీ ఇన్వర్టర్ సెట్‌ను సబ్ రిజిస్ట్రార్ ఇసాక్ గారు స్వయంగా వసతి గృహానికి అందజేశారు
పరీక్షల సమయంలో ఈఇన్వర్టర్ విద్యార్థినులకు ఒక వరప్రసాదంగా మారనుంది. కేవలం ఇన్వర్టర్ మాత్రమే కాకుండా, విద్యార్థులకు పెన్నులు మరియు స్వీట్లు పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ప్రజా సేవలో సరికొత్త పాఠం:
పదవి అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం" అని ఇసాక్ గారు చేతల్లో నిరూపించారు.
ఒక ఉన్నత అధికారి అయి ఉండి, నేరుగా హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులతో సమయం గడపడం, వారి సమస్యలు తీర్చడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం.
ఆయన అందించిన ఈ సాయం విద్యార్థినుల చదువు పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని చాటిచెబుతోంది.
ఈగొప్ప కార్యంలో భాగస్వాములైన సబ్ రిజిస్ట్రార్ ఇసాక్ గారిని, అలాగే వారికి అండగా నిలిచిన కార్యాలయ సిబ్బందిని వసతి గృహ వార్డెన్ జయమ్మ మరియు విద్యార్థినులు హృదయపూర్వక కృతజ్ఞతలతో ముంచెత్తారు.
ఇలాంటి ఆదర్శప్రాయమైన అధికారులు ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి పథంలో సాగుతుందని స్థానికులు కొనియాడుతున్నారు.
