జీడీ రైతులు ఉరి తాళ్ళుతో ఆందోళన.
మంచు తెగులు అకాల వర్షాలకు పంట నష్టం పోయిన జీడీ రైతులకు పరిహారం చెల్లించాలి. సిపిఎం పార్టీ డిమాండ్.
అనకాపల్లి మార్చి:23 దేవరపల్లి మండలం మంచు తెగులు అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ లో గిరిజన రైతులు అర్ధ నగ్నంగా ఉరితాళ్ళు మెడకు వేసు కుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వీరికి మద్దతుగా వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం జిల్లా ఉపాద్యాక్షులు బిటి దొర పల్గోని మాట్లాడారు,ఈసం వత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నక్కపల్లి పర్యటన సందర్భంగా జీడీ పంటలకు నష్ట పరిహారం పై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు గత 5 సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితరవిపత్తులు వల్ల పూత, పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని.తోటలకు గొప్పులు దుక్కులు మందులు కొట్టటానికి ఎకరకు 40,000 రూ పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయారని తెలిపారు
జిల్లాలో 2024-25 సంవత్సరా నికి జీడి పంటల భీమాకు రైతులు వాటవేలాది మందిలక్షలాది రూ/-భీమా కంపెనీలకు చెల్లించినా పంటనష్టాలు జరిగిన ఇంతవరకు పంటల భీమా చెల్లించలేదని భీమా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించ పోవటంతో రైతులకు చెల్లించ లేదన్నారు అందువల్ల ఈసంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంతో వాతావరణ బీమాకంపెనీలు ఎగ్రిమెంట్ చేయలేదన్నారు భీమా ప్రీమియం మొత్తం రైతులు చెల్లించిన వారికే భీమాకంపెనీలు చేసుకు న్నవని తెలిపారు,పంటల భీమా వల్ల ప్రభుత్వం నుంచి రైతుల నుంచి భీమా ప్రీమియం చెల్లించిన డబ్బులుతో భీమా కంపెనీలు లాభ పడుతున్నవి తప్ప రైతులను ఆదు కోలేదన్నారు ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నారని తెలిపారు కనీసం కేజీ 200/-రూ ,,ఇస్తి తప్ప కిట్టుబాటు కదన్నారు అందువల్ల ప్రభుత్వం ఆర్ .ఎస్ .కెల ద్వారా కేజీ 200రూ /కొనుగోలు చేయాలి.
పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు ఆర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వ మే కోనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు నక్కపల్లి వచ్చిన సందర్భంగా జీడీ పంటలకు పరిహారం ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేసారు,లెదంటే ఉరితాళ్ళె శరన్యమని స్పష్టం చేశారు ఈకార్యక్రమంలో ,సిహెచ్ లక్షమణ కాశి ఈశ్వరావు కె సుదకార్ సిహెచ్ చిన దేముడు బి నాగేశ్వరావు ఇ గోపాలుడు కె రాము బి దేముడు ఎర్రయ్య డి సోమయ్య జి దేముడు మామిడి దేముడు ఎరకయ్య పి శ్రీరాం పి,మహలక్ష్మీ నాయుడు యస్ క్రిష్ణా తో పాటు అదిక సంఖ్యలో గిరిజన జీడీ రైతులు పల్గోన్నారు
