రంజాన్ పండుగ సందర్భంగా ఈ ద్ నమాజ్ లో పాల్గొన్న ముత్తుమల్ల ,
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎస్ ఐ ఓ యూనిట్ చేసిన ఈద్ నమాజ్‌లో పాల్గొన్న శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి,అనంతరం ఇస్లామిక్ పుస్తక స్టాల్ ను తిలకించారు,
గిద్దలూరు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ( ఎస్ ఐ ఓ ), గిద్దలూరు యూనిట్ ఈద్ సందర్భంగా పట్టణంలోని ఈద్‌గాహ్‌లో నిర్వహించిన ఈద్ నమాజ్‌లో ఉత్సాహంగా మరియు సామాజిక స్ఫూర్తితో పాల్గొని. ఈ సందర్భంగా ప్రజల్లో ఇస్లామిక్ బోధనలపై అవగాహన పెంపొందించేందుకు ఇస్లామిక్ పుస్తక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ పుస్తక స్టాల్‌లో పవిత్ర ఖుర్‌ఆన్, హదీస్ సంకలనాలు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం మరియు ఆధునిక సమస్యలపై ఇస్లామిక్ దృక్పథంతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సందర్శకులు అందుబాటులో ఉన్న పుస్తకాలపై ఆసక్తి చూపించారు.
గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ రెడ్డి
ఈ కార్యక్రమానికి హాజరై, ఎస్ ఐ ఓ గిద్దలూరు యూనిట్ చేస్తున్న కృషిని అభినందించారు. సమాజంలో విద్యా మరియు నైతిక అభివృద్ధికి తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలను ఆయన ప్రోత్సహించారు.. ఎస్ ఐ ఓ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి డా. రోషన్ మొహిద్దీన్ ఈద్ నమాజ్‌లో పాల్గొని, శాసనసభ్యులకు సియో సాహిత్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఎస్ ఐ ఓ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను కొనసాగించేందుకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.
