గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి వంట గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి స్పష్టం చేశారు.
మంగళవారం టంగుటూరు మండల కేంద్రంలోని నిర్మల ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలండర్ల వివరాలను, స్టాక్ రిజిస్టర్, డైలీ సేల్స్ రిజిస్టర్స్ ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గృహావసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదని, ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయని తెలిపారు. సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చేయాలన్నారు, గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఏజెన్సీలకు సూచించారు. జాయింట్ కలెక్టర్ వెంట మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

