ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం.



 ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం.

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఒంగోల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 80 ఫిర్యాదులు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌/మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు నిర్వహించారు. 

ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. 

అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

 ఈ కార్యక్రమంలో భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు, ఉద్యోగ మోసాలు మరియు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.

జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కందుకూరి ఇన్స్పెక్టర్ ఎస్.కె అన్వర్ భాష, చీమకుర్తి ఇన్స్పెక్టర్ ప్రసాద్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, ప్యానల్ అడ్వకేట్ బి. బాలాజీ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post