అనకాపల్లి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు.


 అనకాపల్లి జిల్లా పోలీసుల విస్తృత తనిఖీలు.

బాణాసంచా తయారీ కేంద్రాలపై పోలీసుల ఉక్కుపాదం: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, మార్చి :02

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వారి ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాలలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా రంగంలోకి దిగి, జిల్లాలోని అన్ని సబ్-డివిజన్ల పరిధిలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు.

​ఈ మేరకు అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల పర్యవేక్షణలో అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, ఫైర్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఉన్న మరియు అనధికారిక యూనిట్లపై దాడులు నిర్వహించారు.

తనిఖీల్లో ప్రధానంగా పరిశీలించిన అంశాలు:

ఎక్స్‌ప్లోజివ్ రూల్స్ మరియు PESO నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే తయారీ/నిల్వ లైసెన్స్‌లు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.

షెడ్లలో అనుమతించిన పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ మరియు ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయో లేదో పరిశీలించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా స్పార్క్-ప్రూఫ్ సిస్టమ్స్ మరియు ఎర్తింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు.

శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా? చైల్డ్ లేబర్ ఉన్నారా? సింథటిక్ దుస్తులు ధరించకుండా కాటన్ దుస్తులనే వాడుతున్నారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అగ్నిమాపక పరికరాల లభ్యత, ఎగ్జిట్ పాయింట్లు మరియు పొగత్రాగడంపై నిషేధం వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు.

​జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక:

"జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా బాణాసంచా తయారు చేసినా లేదా నిల్వ ఉంచినా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడమైనది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.​ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ తనిఖీలు నిర్వహించడమైనది. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచితే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post