ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్.
బైక్ను డీకున్న ఆర్టిసి ఇద్దరికి తీవ్ర గాయాలు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి మార్చి:13 చోడవరం వైపు నుంచి విశాఖపట్నం వెళు తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాలివి.
శుక్రవారం ఉదయం మండలంలోని నర్సాపురం పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద మోటార్ సైకిల్పై అడ్డూరు నుంచి వెంకన్నపాలెం వైపు వస్తున్న బైక్ను చోడవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సర్సాపురం జంక్షన్ వద్ద బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న మల్లంపాలెం గ్రామానికి చెందిన బి. వెంకటరమణతో పాటు అతని స్నేహితుడు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 లో ఆసుపత్రికి తరలించారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.
