ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి.


 ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి.

* హాల్ టికెట్స్ ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం.

* అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ పై జిల్లా విద్యాశాఖ చర్యలు శూన్యం.

* ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ లో ప్రభుత్వేతర సిలబస్.

* ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రైవేట్ స్కూల్స్ కు వర్తించవు.

* ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రైవేట్ స్కూల్స్ కి వర్తించవు.

* ప్రైవేట్ స్కూల్స్ తమ తమ సొంత సిలబస్తో ఇటు విద్యార్థులపై, అటు తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్న వైనం.

* చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు.

* అధిక ఫీజులు వసూళ్ల నేపథ్యంలో పిల్లల హాల్ టికెట్స్ ఇవ్వకుండా బ్లాక్మైలింగ్ చేస్తున్న వైనం.

* ప్రైవేట్ స్కూల్స్ పై తమ పర్యవేక్షణ కోల్పోయిన ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి.

* ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు శూన్యం.

* ఇది అధికారులు నిర్లక్ష్యమా... లేక కాసుల మత్తా.. అనేది తెలియాల్సి ఉంది.

* జిల్లా విద్యాశాఖ అధికారులు కాసుల మత్తులో లేకుంటే ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై ఈ విద్యా సంవత్సరంలో ఏ చర్యలు తీసుకున్నారు ఎన్ని స్కూల్స్ కి లైసెన్స్ రద్దు చేశారో మీడియా సమక్షంలో తెలుపగలరా..?

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

   ఏలూరు జిల్లాలో చెలరేగిపోతున్న ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు... స్కూల్ విద్యార్థులతో పనులు చేపించడాలు లాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ తమ తమ వ్యక్తిగత సిలబస్ ఏర్పరచుకొని వాటికి ఐఐటి అని ఒలంపియాడ్ అని అనేక రకాల పేర్లు పెడుతూ ఒకటవ తరగతి నుండి స్కూలు విద్యార్థులపై ప్రభుత్వేతర సిలబస్ బలవంతంగా రుద్దడం... అందు నిమిత్తం తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం జరుగుతున్న జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఫీజు మొత్తం చెల్లిస్తేనే గాని హాలి టికెట్స్ ఇవ్వమని, అప్పటివరకు క్లాస్ రూమ్ లో ఫీజు బకాయిలు ఉన్న విద్యార్థులను తోటి విద్యార్థులు ముందు నిలబెట్టి వారిని మానసికంగా వేధిస్తున్న వైనం... కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఒక్క అడుగు ముందుకు వేసి పిల్లల్ని ఫీజు బకాయిలు చెల్లించలేదని ఇంటికి పంపిస్తున్న వైనం. అనధికార ఫీజు వసూళ్లు, పిల్లల్ని మానసికంగా వేధించడాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు లెక్కచేయకుండా ప్రభుత్వ అధికారులు సైతం నోరు ఎత్తి మాట్లాడనీయకుండా ప్రైవేట్ స్కూల్స్ మాఫియా లాగా తయారయ్యి ప్రభుత్వ అధికారులపైనే హుకుం జారీ చేసే స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు నడుస్తున్న తీరు విద్యాశాఖ వ్యవస్థ ఏమైపోతుంది అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. అధికారులు వారి వారి జీతాలు తీసుకోవడంపై ఉండే శ్రద్ధలో కాస్త విధి నిర్వహణలో ఉండాలని ప్రజల ఆవేదన. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ కట్టడాలు, హాల్ టికెట్స్ ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తు వేధించడాలు, కొన్ని స్కూల్స్లో ఏమైనా ప్రమాదం జరిగితే విద్యార్థులను కాపాడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడాలు, ఫైర్ అండ్ సేఫ్టీ మేకపోడాలు, ప్రమాదం జరిగినప్పుడు కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా లేకుండా కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు స్కూల్స్ నిర్వహిస్తున్న.... జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ విధంగా పరిమిషన్స్ ఇస్తున్నారనేది తెలియాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ విద్యాశాఖ ఏ స్థాయిలో పనిచేస్తుందిఅనేది ... నిర్లక్ష్య వైఖరి మరియు కాసుల మత్తులో ఉన్నధి తెలుస్తుంది. ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటారో లేక నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరి స్తారో అనేది వేచి చూడాలి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post