ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు.


 ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వల్నరబుల్ పిల్లల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

సార్డ్స్ (SARDS) ఆర్గనైజేషన్ – యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కాపురం జిల్లా పెద్దఆరవీడు మండలఅభివృద్ధి కార్యాలయంలో వల్నరబుల్ పిల్లలు మరియు వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ఎం.పి.డి.ఓ ఎస్ జాన్ సుందరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన మరియు సంరక్షణ అవసరమైన పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ముఖ్యంగా పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ మరియు సామాజిక భద్రతకు సంబంధించిన పథకాల గురించి వివరించారు.

అలాగే పిల్లల హక్కులు, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికత్వం నిర్మూలన వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. 

పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు కుటుంబ సభ్యులు మరియు సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సార్డ్స్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ఎం. శ్రీనివాసులు, సుమన్, నయోమి, ఆదిమూలపు అనిల్ రాజ్ లూకా, స్పాన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఎన్. నాగయ్య, ఎన్. ప్రభుదాస్, “డెట్టాల్ బనేగా స్వచ్ఛ ఇండియా” ప్రతినిధి టి. లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, వి.ఓలు, మహిళా పోలీస్ సిబ్బంది, యానాది సంఘం పెద్దలు, వల్నరబుల్ పిల్లల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post