సమన్వయంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా విజయవంతం చేద్దాం.
భక్తుల మనోభావాలను అటవీశాఖ గౌరవించి సహకరించాలి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
నెమలిగుండ్ల క్షేత్రంలో సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు.
మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి. రాజా బాబు వెల్లడి.
ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి కలెక్టర్ ప్రశంసలు,
బ్రహ్మోత్సవాల నోడల్ ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్.
తరలివచ్చిన మార్కాపురం జిల్లా యంత్రాంగం పాకల బీచ్ తరహాలో కల్చరల్ ప్రోగ్రామ్స్ శాసనసభ్యులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి. రాజా బాబు కోరారు. నెమలిగుండ్ల క్షేత్రంలో శనివారం గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ నెల 2 నుంచి 5 వరకు జరిగే నెమలిగుండ్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తొలుత క్షేత్రస్థాయి పరి|శీలన చేశారు.
భక్తులకు సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జంగిల్ క్లియరెన్స్, ఫైౖర్‌లైన్స్, ప్లాస్టిక్ ఏరివేతకు ఆదేశాలిచ్చారు.
స్వామి వారి దర్శనం అనంతరం సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాజబాబు మాట్లాడారు.
అటవీ, పర్యావరణం, వన్యప్రాణులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటూనే భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు అటవీ శాఖ సహకరించాలని కోరారు.
అటవీశాఖ ఆంక్షలపై దేవదాయ, పోలీసుశాఖలు లేవనెత్తిన అంశాలపై కలెక్టర్ స్పందించారు.
అటవీ కోర్ ఏరియా ప్రాంతాల్లో కొన్ని నిబంధనలున్నప్పటికీ తిరుమల తరహాలో భక్తుల మనోభావాలను అటవీశాఖ గౌరవించాలని, ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు సహకరించాలని నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ ఎస్ టి ఆర్) గిద్దలూరు డివిజనల్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారికి సూచించారు.
నెమలిగుండ్ల క్షేత్రంలో సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతామన్నారు.బ్రహ్మోత్సవాలకు జెసి శ్రీనివాసులును నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు వెల్లడించారు.
శాసనసభ్యులు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆర్టీసీ అధికారులు దూర ప్రాతాలనుంచి నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు.
పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, విద్యుత్, వైద్యశాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. నా భూతో న భవిష్యతి.. అన్న రీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, పాకల బీచ్ తరహాలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పోరేషన్ డైరెక్టర్ కె.యోగానంద్, దేవస్థానం ఛైర్మన్ సిద్ధం నరసింహులు, జనసేన ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబా, మాజీ జడ్‌పిటీసి సభ్యులు కుప్పా రంగనాయకులు, మాజీ సర్పంచ్ బత్తిని వెంకటేశ్వరరావు,
మార్కాపురం డిఎస్‌పి నాగరాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాల రావు, దేవస్థానం ఈఒ, బాపట్ల ఇంఛార్జి అసిస్టెంట్ కమిషనర్ మల్లవరపు నాగయ్య, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిపిఒ, గిద్దలూరు, కంభం సిఐలు రామకోటయ్య, మల్లిఖార్జున, రాచర్ల ఎస్ ఐ కోటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులు, జె.పి.చెరువు ఎంపిటీసీ జెట్టి వెంకటేశ్వర్లు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పుట్టా బాలక్రిష్ణ, తదితరులు పాల్లొన్నారు.

