పదవ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.


 పదవ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

10వ తరగతి విద్యార్థి ని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన ఎస్పీ.

మార్కాపురం జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. 

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరిగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు. 

కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. 

ఇన్విజిలేటర్లు మరియు విధుల్లో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని తెలిపారు. మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post